సాఫ్ట్ బేస్ బాల్ పోటీలకు ఎంపికైన త్రినిటీ విద్యార్థులు

సాఫ్ట్ బేస్ బాల్ పోటీలకు ఎంపికైన త్రినిటీ విద్యార్థులు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణంలోని త్రినిటి పాఠశాలకు చెందిన విద్యార్థులు పీ. నిశాంత్, కే. మనోజ్ కుమార్, కే. వైష్ణవి, జీ. అక్షర లు ఈనెల 19వ తేదీన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన తెలంగాణ రాష్ట్ర నాలుగవ సాఫ్ట్ బేస్ బాల్ సబ్ జూనియర్ పోటీల(Soft Baseball Sub Junior Competitions)లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచి తెలంగాణ జట్టుకు ఎంపికయ్యారని పాఠశాల చైర్మన్ కేవీబీ కృష్ణారావు(KVB Krishna Rao), ప్రిన్సిపాల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల తెలిపారు.

ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు వచ్చే నెల 7,8,9 తేదీలలో మహారాష్ట్ర(Maharashtra)లోని షిరీడిలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా క్రీడాకారులను ఉద్దేశించి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి బంగారు పథకా(Bangaru Pathaka)న్ని తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply