Social Media | ప్రశ్నిస్తే.. దాడి..

Social Media | ప్రశ్నిస్తే.. దాడి..

Social Media, కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : సోషల్ మీడియా (Social Media) పోస్టుల పై రగడ కొనసాగుతుంది. కృష్ణా జిల్లా (Krishna District) పెడనలో జరుగనున్న పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో శనివారం వ్యాపార సముదాయాల బహిరంగ వేలం పాటల నిర్వహణ జరిగింది. ఆ వేలం పాటకు హాజరైన పలువురి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మొన్న ఢిల్లీలో జరిగింది.. నేడు గల్లీలో జరుగుతోంది అంటూ వ్యాఖ్యానించిన వ్యక్తిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు.

పైడమ్మ గుడి తాలూకా వేలం పాటలు జరుగుతున్నప్పుడు షాపుల వేలంపాటకు హిందువులకు కాకుండా ఇతర మతస్థులు వచ్చారని కృష్ణా జిల్లా హిందూ చైతన్య వేదిక అధ్యక్షులైన నాదెండ్ల కోటేశ్వరరావు పెడనలో ఆదివారం మీడియా దృష్టికి తీసుకొచ్చారు. కృష్ణా జిల్లా హిందూ చైతన్య వేదిక అధ్యక్షులైన తనను శనివారం రాత్రి 11 గంటల సమయంలో అరెస్టు చేశారని తెలిపారు. నోటీసులు ఇవ్వమని చెప్పినా.. ఇవ్వలేదని, ఫోన్ లాక్కుని ఉదయం 11 గంటలకు ఉద్దేశ్యపూర్వకంగా నేనే పోస్టు చేశానని పోలీసులు ఒత్తిడికి గురి చేశారని తెలిపారు.

ఎస్పీ గారిని అడుగుతున్నానని.. సంవత్సరం క్రితం వినాయకుడి గుడి మీద రాళ్లు వేస్తే.. ఏం చేశారని ప్రశ్నించారు. 70 మంది గతంలో దాడి చేసినా నాపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని, హిందువులకు భద్రత లేదని విమర్శించారు. రెండు సంవత్సరాల క్రితం ఇతర మతస్థులు వేలం పాడటం వల్ల ఆ షాపుల యజమానులు భక్తులను నిలువుదోపిడీ చేశారని, ప్రశ్నిస్తే పది మంది కూడా దాడికి పచ్చారని తెలిపారు. రెండు సంవత్సరాలుగా పడిన ఇబ్బందులను ఆలయ ఈవో దృష్టికి తీసుకెళ్లగా, ఆయన మేము ఎవరికైనా ఇస్తామని చెప్పటం బాధాకరమన్నారు. హిందు దేవాలయాల్లో వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్లి ఇతర మతస్తులకు ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అన్నారు.

Leave a Reply