Social | గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామానికి సేవకురాలిగా పనిచేస్తా..

Social | గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామానికి సేవకురాలిగా పనిచేస్తా..
- గతంలోని చేసిన అభివృద్ధి పనులే నా గెలుపుకు మలుపు
Social | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రం ఆళ్లపల్లి గ్రామపంచాయతీ సీపీఐ పార్టీ బలపరిచిన గ్రామపంచాయతీలో సీపీఐ అభ్యర్థి మెస్సుమమత విజయతీరంలో యాత్రిక్ విజయం కోసం బ్యాట్ గుర్తుతో ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగుతుంది. సీపీఐ గ్రామ సర్పంచ్ బరిలో తన గుర్తు బ్యాట్ గుర్తు వచ్చిందని మీ అమూల్యమైన, పవిత్రమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
గతంలో అంబేద్కర్ నగర్లో, భగత్ సింగ్ సెంటర్ ప్రధాన రహదారిలో15 లక్షల(15 lakhs) వ్యయంతో సీసీరోడ్ల నిర్మాణం చేపట్టిన ఘనత సీపీఐ పార్టీకి దక్కిందన్నారు. గత అభివృద్ధి పనులే నా గెలుపు విజయానికి బాటలు వేస్తాయన్నారు. సాంఘిక(social), సామాజిక సేవలో ఆధ్యాత్మిక దేవాలయ అభివృద్ధి కార్యక్రమంలోనూ చేసిన మంచి పనులే నావిజయం ముందు కెరటంలా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఒక్కసారి అవకాశం కల్పించండి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆమె ప్రచారం చేశారు. ఎన్నికల్లో(elections) బ్యాట్ గుర్తుకు ఓటెయ్యండిని, ఆళ్లపల్లి గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆమె తెలిపారు. జిల్లా, మండలంలోని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని హామీఇచ్చారు. నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు(welfare schemes) అందించడంలో ముందుంటానని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు మంజూరు చేయిస్తానని. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తానని, మూడోసారి ఎన్నికల్లో సీపీఐ సర్పంచి అభ్యర్థిగా అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఆళ్లపల్లి ప్రజలే విజయం ఖాయమని విశ్వసిస్తున్నారని, ప్రజల సమస్యలు తీర్చడానికి ఎన్నికల్లోకి వచ్చానని విజ్ఞప్తి చేశారు.
