పేదింటి పెళ్లికి అండగా నిలిచిన సామాజికవేత్త కోడం శివకృష్ణ

కరీమాబాద్, ఆంధ్రప్రభ: పేదింటి ఆడబిడ్డ వివాహానికి సామాజికవేత్త కోడం శివకృష్ణ సహాయం అందించారు. మంగళవారం 33వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిక్కులపల్లి సతీష్ సోదరి వద్దిరాజు సంధ్యా శ్రీధర్ కుమార్తె సాత్విక వివాహం సందర్భంగా ఆయన 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కోడం శివకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కత్తెరశాల శ్రీధర్, కేఎస్‌కే టీం సభ్యులు కొమ్మరాజుల సందీప్, బొమ్మగాని శ్రీనివాస్, తొగరు చందు, దయాసింగ్, బాలచైతన్య, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply