SLBC | మంత్రిగారూ.. మా రైతులను గాలికొదిలేశారా?

SLBC | మంత్రిగారూ.. మా రైతులను గాలికొదిలేశారా?
- 3కిమీ.ల కోసం 8 కిమీ.. తిరగాలా సారూ?
- నేరడ – గాదిరెడ్డిపల్లి బ్రిడ్జికి ఇంకెన్నాళ్ళు సారూ?
- రైతుల పక్షాన బీజేపీ నేత కాసోజు శంకరాచారి నేతృత్వంలో పరిశీలన
- అతి త్వరగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్
SLBC | చిట్యాల, ఆంధ్రప్రభ : ఎస్ఎల్బీసీని ఇష్టారీతిన తవ్వేసి.. రైతులను (Farmer) ఇక్కట్లకు గురి చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేరడ నాయకులు కాసోజు శంకరాచారి. నేరడ – గాదిరెడ్డిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని, విజయవాడ హైవేకు చేరుకోవాలంటే ఊరంతా తిరగాల్సి వస్తుందని, రైతులు ఆందోళనకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు.

నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన రైతులు దుబ్బాక వెంకట్ రెడ్డి (రైస్ మిల్), (Rice Mill) గంజి కృష్ణయ్య, పెద్దగొల్ల సత్తయ్య తదితరులతో కలిసి కాలువను పరిశీలించిన శంకరాచారి జిల్లా మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్, అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 3 కిమీ.ల కోసం 8 కిలోమీటర్లు తిరగాలా సారూ అని వాపోయారు. బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే రైతులకు ఎంతో ఉపయోగమని, వెంటనే చర్యలు చేపట్టాలని, లేదంటే రైతులతో కలిసి మహా ధర్నా చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పిల్లలమర్రి రమేశ్, ప్రిన్స్ రమేశ్, నరేశ్, ఆవుల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
