Six guarantees | మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి…

Six guarantees | మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి…
- మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
- నూతన సర్పంచులకు సన్మానం
Six guarantees | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నిక(municipal elections)ల్లో బీజేపీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి మున్సిపాలిటీ లను కైవసం చేసుకోవాలని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు. బీజేపీ చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని హోటల్ 9లో త్వరలో జరగబోవు చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ… చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల(six guarantees) పేరుతో అమలు కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ను బొంద పెట్టాలని ప్రజలను కోరారు. మున్సిపల్ అధ్యక్షురాలు కల్పన ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ… చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలన మీద మనం ఎన్నో పోరాటాలు చేసి స్థానిక తహసీల్దార్ కు, ఆర్డీఓకు, మున్సిపల్ కమిషనర్ కు అక్రమ కట్టడాల మీద, మురికి కాలువల మీద వినతి పత్రాలు ఇచ్చామన్నారు.
జిల్లా కమిటీ మాజీ ఉపాధ్యక్షులు రమణగోని శంకర్ మాట్లాడుతూ… గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కండువాలు మార్చి ప్రజలను మోసం చేశారని, బీజేపీ కౌన్సిలర్లను గెలిపించుకొని చౌటుప్పల్ గడ్డమీద బీజేపీ జెండా(BJP flag) ఎగురవేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు దూడల భిక్షంగౌడ్, పోలోజు శ్రీధర్ బాబు, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఆలె చిరంజీవి, మందోల్లగూడెం సర్పంచ్ తంగెళ్ళ వెంకటేశం, రెడ్డి భావి సర్పంచ్ నందగిరి వెంకటేశం గౌడ్, కాట్రేవ్ సర్పంచ్ బోయ మహేంద్ర మణి, గుజ్జుల సురేందర్ రెడ్డి, మునగాల తిరుపతిరెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్ ఉబ్బు బిక్షపతి ఉడుగు యాదయ్య గౌడ్, బత్తుల జంగయ్య గౌడ్, కడారి ఐలయ్య యాదవ్, చికురి ప్రభాకర్,, తదితరులు పాల్గొన్నారు. కాగా నూతన సర్పంచులను మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అభినందిస్తూ పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.
