Sivaratri | నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు..

Sivaratri | నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు..
Sivaratri నిజామాబాద్, ఆంధ్రప్రభ : సంపూర్ణ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇందూర్ ప్రజలు చల్లగా ఉండాలని ఆ భగవంతుడినీ వేడుకున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. శివరాత్రి పండుగ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా నీలకంఠేశ్వర ఆలయంలో నీలకంఠేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరమేశ్వరుడి అనుగ్రహంతో అందరూ బాగుండాలని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని తెలిపారు.
