రుణాలు సకాలంలో చెల్లిస్తేనే సింగిల్ విండో అభివృద్ధి

రుణాలు సకాలంలో చెల్లిస్తేనే సింగిల్ విండో అభివృద్ధి
- పర్సన్ ఇంచార్జ్ కరుణాకర్ రెడ్డి
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : రైతులు సింగల్ విండో ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి ఇచ్చినప్పుడే సింగల్ విండో అభివృద్ధి చెందుతుందని పర్సన్ ఇంచార్జ్ కరుణాకర్ రెడ్డి అన్నారు. జుక్కల్ విండో కార్యాలయంలో మంగళవారం నాడు మహాజన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణాలు తీసుకున్న రైతులు వడ్డీ కట్టి రుణాలను రెన్యువల్ చేసుకోవాలని లేకుంటే చక్ర వడ్డీతో రుణాలు చెల్లించవలసి ఉంటుందన్నారు.
విండో కార్యాలయంలో యూరియాతో పాటు గ్రోమోర్ 20:20 ఎరువుల అందుబాటులో ఉన్నాయని దీనిని యాప్ ద్వారా రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.అర్హులైన రైతులు సంఘ సభ్యులుగా చేరి సంఘ అభివృద్ధికి తోడ్పడాలన్నారు.ఈ సందర్భంగా ఈపీఓ(డోలన్ ఎక్స్పోర్ట్)హుస్సేన్,మాజీ విండో చైర్మన్ నగల్గిద్దే శివానంద్,మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు,ఏఎంసీ చైర్మన్ భర్త ఐల్వర్ రమేష్ రైతునేత గంగాధర్ నాయక్, రైతులు డి.ఉమాకాంత్,విండో కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
