శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘సింగిల్’. కార్తిక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్ లు గా నటించగా.. నటీనటుల మధ్య కెమిస్ట్రీ, వినోదాన్ని పంచే కామెడీ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉండటంతో విస్తృత ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది.