
Singareni@105 | నల్ల బంగారానికి నూరేళ్ల నిబద్ధత..
Singareni@105 | నల్ల బంగారానికి నూరేళ్ల నిబద్ధత..
- 13 దశబ్దాల సింగరేణి జర్నీ
- ఇల్లందులో తొలిసారి ఉత్పత్తి
- గోదావరి లోయ గుండెల్లో 21,464 మిలియన్ టన్నుల సంపద
- రేపు 105వ సింగరేణి దినోత్సవం
Singareni@105 | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : సింగరేణి.. బొగ్గును వెలికి తీసే సంస్థ మాత్రమే కాదు! కోట్లాది ప్రజలకు వెలుగుల నింపేందుకు లక్షలాది మంది కార్మికుల శ్రమశక్తికి నిదర్శనం! సుమారు 130 ఏళ్ల చరిత్ర(130 years of history) కలిగిన సింగరేణి గనుల్లో మరో వందేళ్ల వరకూ బొగ్గు ఉత్పత్తికి భరోసా ఉంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రారంభమై రేపటి ( 23వ తేదీ డిసెంబర్)కి 105 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం….
Singareni@105| సింగరేణి ప్రస్థానం…

1870లో బ్రిటిష్ శాస్త్రవేత్త విలియం కింగ్ పరిశోధనలతో ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని సింగరేణి ప్రస్థానం మొదలైంది. 1886లో ఇల్లెందులో తొలిసారిగా తవ్వకాలు ప్రారంభించారు. 1889లో వాణిజ్యపరంగా బొగ్గు ఉత్పత్తి(coal production) మొదలైంది. 1920 డిసెంబర్ 23న ఈ సంస్థకు ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ (SCCL) గా నామకరణం చేశారు. నాటి నుండి నేటి వరకు విస్తరిస్తూ 1928లో బెల్లంపల్లి, 1937లో కొత్తగూడెం, 1961లో రామగుండం ప్రాంతాల్లో గనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సంస్థ 18 ఓపెన్‌కాస్ట్ , 22 భూగర్భ గనుల ద్వారా ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.
Singareni@105 | అన్వేషణలో అత్యాధునిక సాంకేతికత..



బొగ్గును నేరుగా వెలికితీసే అవకాశం లేని చోట్ల కూడా అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్(coal gasification), కోల్‌బెడ్ మిథేన్స తదితర సాంకేతిక పద్ధతుల ద్వారా ఇంధనాన్ని పొందేందుకు సింగరేణి ప్రయత్నాలు చేస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో 600 నుండి 1500 మీటర్ల లోతులో ఉన్న బొగ్గు పొరలను గుర్తించేందుకు అత్యాధునిక డిజిటల్, జియోఫిజికల్ సాంకేతికతను వాడుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఐఆర్వో (CSIRO) సహకారంతో రామగుండం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు(long wall project)లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. డ్రిల్లింగ్ యంత్రాల ద్వారా ప్రతి 400 మీటర్లకు ఒక బోరు వేసి, భూమి లోపల బొగ్గు నాణ్యత, మందం, లోతును కచ్చితంగా లెక్కిస్తున్నారు.
Singareni@105 | జిల్లా వారీగా బొగ్గు నిక్షేపాల వివరాలు (మిలియన్ టన్నుల్లో) :

- మంచిర్యాల: 3,305.11
- భద్రాద్రి కొత్తగూడెం: 2,801.26
- పెద్దపల్లి: 1,894.02
- భూపాలపల్లి: 1,717.77
- ఆసిఫాబాద్: 623.63
- ఖమ్మం: 504.76
Singareni@105 | సింగరేణికి రెండో తల్లి.. బెల్లంపల్లి..

సింగరేణి విస్తరణలో బెల్లంపల్లి ప్రాంతం కీలక పాత్ర పోషించింది. ఒకప్పుడు ఈ ప్రాంతం కనుమరుగవుతుందనే ఆందోళన ఉన్నప్పటికీ, తాజా అన్వేషణలో ఇక్కడ భారీ నిల్వలు బయటపడ్డాయి. బెల్లంపల్లి శాఫ్ట్ బ్లాక్-1 నుండి 4 వరకు, అలాగే శాంతిఖని ఎక్స్‌టెన్షన్(extension), శ్రావణపల్లి మరియు గోలేటి మెగా ఓపెన్‌కాస్ట్ వంటి ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతం మళ్లీ సిరుల మాగాణిగా మారబోతోంది.
ఇది స్థానిక కార్మికులకు మరియు నిరుద్యోగులకు కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. ఉత్తర తెలంగాణలో సింగరేణి విస్తరణకు నాంది పలికిన బెల్లంపల్లి ప్రాంతం, సంస్థకు రెండో తల్లిగా గుర్తింపు పొందింది. ఒకప్పుడు గనులు మూతపడి ఈ ప్రాంతం కనుమరుగవుతుందనే ఆందోళన ఉన్న తరుణంలో, తాజా అన్వేషణలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. బెల్లంపల్లి శాఫ్ట్ బ్లాక్-1 నుండి 4 వరకు, అలాగే శాంతిఖని ఎక్స్‌టెన్షన్, శ్రావణపల్లి, గోలేటి మెగా ఓపెన్‌కాస్ట్(Goleti Mega Opencast) వంటి ప్రాంతాల్లో భారీ నిక్షేపాలను గుర్తించారు. ఇవి రానున్న రోజుల్లో కొత్త భూగర్భ, ఓపెన్‌కాస్ట్ గనుల ప్రారంభానికి మార్గం సుగమం చేస్తున్నాయి.
Singareni | 800 meters | ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి..

బొగ్గును వెలికితీయడం క్లిష్టంగా ఉన్న 600 నుండి 1500 మీటర్ల లోతైన ప్రాంతాలలో అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ), కోల్‌బెడ్ మిథేన్ (సీబీఎం) పద్ధతులను అమలు చేసేందుకు సింగరేణి(Singareni) సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఐఆర్వో (సీఎస్ ఐఆర్ ఓ) సాంకేతిక సహకారంతో రామగుండం అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో విజయవంతంగా పరీక్షలు నిర్వహించారు. కేవలం బొగ్గుకే పరిమితం కాకుండా, బయ్యారం ఇనుప ఖనిజ అన్వేషణ బాధ్యతలను కూడా ప్రభుత్వం సింగరేణికే అప్పగించడం ఈ సంస్థపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
Singareni@105| బొగ్గు నిక్షేపాల అన్వేషణ విధానం..
భూమి లోపల ఉన్న ఖనిజ సంపదను గుర్తించేందుకు సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తోంది. కిలోమీటర్‌కు ఒక బోరు చొప్పున డ్రిల్లింగ్ యంత్రాల ద్వారా బోర్లు వేసి ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తారు. ఈ డ్రిల్లింగ్‌ను గరిష్టంగా 800 మీటర్ల(800 meters) లోతు వరకు నిర్వహించడం ద్వారా భూగర్భంలో ఉన్న బొగ్గు పొరల స్వరూపం, మందం, నాణ్యతపై అవగాహన పొందుతారు.
ఈ ప్రాథమిక సమాచారం ఆధారంగా ప్రాణహిత–గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలపై సమగ్ర అధ్యయనం చేయడానికి ప్రతి 400 మీటర్లకు ఒక బోరు చొప్పున కోర్ నమూనాలను సేకరిస్తున్నారు. సీమ్ వారీగా, సెక్టార్ వారీగా, మందం ఆధారంగా నిక్షేపాలను గుర్తించి, వాటి వివరాలను సింగరేణి ప్రాజెక్ట్ ప్లానింగ్ విభాగానికి నివేదిస్తున్నారు.
Singareni | 800 meters | బెల్లంపల్లి కేంద్రంగా బొగ్గు విస్తరణకు బాటలు..
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బొగ్గు గనుల విస్తరణకు నాంది పలికిన సింగరేణి సంస్థకు బెల్లంపల్లి ప్రాంతం రెండో తల్లిగా పేరుగాంచింది. సిరుల మాగానిగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం తన గర్భంలో అపారమైన నల్ల బంగారాన్ని దాచుకుని ఉంది. ఒక దశలో కనుమరుగవుతుందన్న భావనకు లోనైన బెల్లంపల్లి ప్రాంతాన్ని కాపాడేందుకు, బొగ్గు ఉత్పత్తికి మద్దతుగా అన్వేషణ విభాగం(exploration department) విస్తృత సర్వేలు నిర్వహించి అనేక బొగ్గు బ్లాకులను గుర్తించింది. రానున్న రోజుల్లో కొత్త భూగర్భ గనులు, కొన్ని ప్రాంతాల్లో ఓపెన్‌కాస్ట్ గనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సింగరేణి సంస్థ భావిస్తోంది.
Singareni@105| 1992–2014 మధ్య గుర్తించిన బొగ్గు బ్లాకులు..
1992 నుంచి 2014 వరకు నిర్వహించిన బొగ్గు అన్వేషణలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతంలో అనేక కీలక బ్లాకు(block)లు గుర్తించబడ్డాయి.
- బెల్లంపల్లి షాఫ్ట్ బ్లాక్–1లో 1997లో 63.88 మిలియన్ టన్నులు
- బ్లాక్–2లో 2005లో 80.45 మిలియన్ టన్నులు
- బ్లాక్–3లో 2009లో 85.67 మిలియన్ టన్నులు
- బ్లాక్–4లో 2010లో 75 మిలియన్ టన్నుల(75 million tons) బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించారు.
- అలాగే 1992లో శాంతిఖని ఎక్స్‌టెన్షన్‌లో 113.01 మిలియన్ టన్నులు, 2004లో శాంతిఖని లాంగ్‌వాల్ ఎక్స్‌టెన్షన్‌లో 75 మిలియన్ టన్నుల నిక్షేపాలు గుర్తించారు.
- నెన్నెల మండలం శ్రావణపల్లి ప్రాంతంలో 1998లో బ్లాక్–1లో 66.04 మిలియన్ టన్నులు, 2014లో బ్లాక్–2 డిప్ సైడ్‌లో 124.12 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు తేలింది.
- గోలేటి ప్రాంతంలో 1,358 హెక్టార్ల(1,358 hectares) విస్తీర్ణంలో మెగా ఓపెన్‌కాస్ట్ గని పరిధిలో 39 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు గుర్తించబడ్డాయి.
- మూసివేసిన ఎంవీకే–1, 2, 3 భూగర్భ గనుల్లో 30 మిలియన్ టన్నుల బొగ్గు మిగిలి ఉండగా, గోలేటి–1, 1ఏ, 2 గనుల్లో మరో 39 మిలియన్ టన్నుల అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సింగరేణి సంస్థ అంచనా వేస్తోంది.
- ఈ ప్రాంతాల్లో మెగా ఓపెన్‌కాస్ట్ గనులు ప్రారంభించేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.
Singareni@105| భూపాలపల్లి, కొత్తగూడెం, చింతలపూడి ప్రాంతాల్లో అన్వేషణ..
2009–10 కాలంలో డ్రిల్లింగ్ యంత్రాల సహాయంతో భూపాలపల్లి షాఫ్ట్ బ్లాక్‌ను గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 46 బ్లాకులను అన్వేషణ విభాగం గుర్తించింది. అంతేకాదు, చింతలపూడి (ఆంధ్రప్రదేశ్) సబ్‌బేసిన్(subbasin)లో కూడా బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సర్వే నివేదికలో పేర్కొంది. గోదావరి పరివాహక ప్రాంతంలో 2017 మార్చి 31 నాటికి సింగరేణి అన్వేషణ విభాగం మొత్తం 21,464 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారించింది.
Singareni@105| గ్రేడ్, లోతు వారీగా బొగ్గు నిల్వలు..


రాష్ట్రంలో ఉన్న బొగ్గు నిల్వల్లో అధిక శాతం జీ గ్రేడ్ (జీ–7, జీ–8)గా గుర్తించారు. ఏ-గ్రేడ్ బొగ్గు 108.34 మిలియన్ టన్నులు ఉండగా, బీ, సీ గ్రేడ్‌లలో 455.79 మిలియన్ టన్నులు, డీ-గ్రేడ్‌లో 2,045.63 మిలియన్ టన్నులు, జీ–7, జీ–8 గ్రేడ్‌లలో 2,573.54 మిలియన్ టన్నులు ఉన్నట్లు అంచనా వేశారు. జీ–15, జీ–17 గ్రేడ్‌లకు చెందిన బొగ్గు నిక్షేపాలు 4.22 మిలియన్ టన్నులు ఉన్నట్లు గుర్తించారు. గ్రేడ్, లోతు వారీగా నిక్షేపాల వివరాలను ఇంకా సేకరిస్తున్నారు.
Singareni@105| అన్వేషణ విభాగం విస్తృత బాధ్యతలు..
బొగ్గు నిల్వల గుర్తింపుతో పాటు బయ్యారం ఇనుప ఖనిజాల అన్వేషణ బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి అన్వేషణ విభాగానికి అప్పగించింది. భూగర్భ జలాల అధ్యయనం, జియో ఇంజనీరింగ్, ఎనాలిటికల్(analytical) స్టడీస్, జియోలాజికల్ మోడలింగ్ వంటి అంశాలను ఈ విభాగం పర్యవేక్షిస్తోంది.
Singareni@105| అత్యాధునిక సాంకేతికతతో అన్వేషణ..
ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఐఆర్వో సంస్థ సాంకేతిక సహకారంతో జియో టెక్నికల్, హైడ్రో జియోలాజికల్, జియో ఫిజికల్, ఇన్‌సిటూ స్ట్రెస్ మెజర్‌మెంట్ అంశాలపై ఆధునిక పరీక్షలు నిర్వహించారు. దేశ బొగ్గు ఉత్పత్తి చరిత్రలో కీలక ఘట్టంగా, రామగుండం ప్రాంతంలోని అడ్రియాల లాంగ్‌వాల్ బ్లాక్–17లో 77.5 మీటర్ల నుంచి 522 మీటర్ల లోతు వరకు బోర్లు వేసి 30 పెర్మియబిలిటీ(30 Permeability) పరీక్షలు, ఇన్‌సిటూ స్ట్రెస్ మెజర్‌మెంట్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు.
బంగారాన్ని దాచుకున్న భూమిగా, సింగరేణికి రెండో తల్లిగా పేరుగాంచిన బెల్లంపల్లి ప్రాంతం నేటి పరిస్థితుల్లో వెనుకబడుతోందన్న ఆందోళనల మధ్య, కొత్త భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్ గనుల ప్రారంభానికి అన్వేషణ విభాగం గుర్తించిన బ్లాకులు ఈ ప్రాంత భవిష్యత్తుపై మళ్లీ ఆశలు రేపుతున్నాయి.
Singareni@105 | గోదావరిలోయ గర్భంలో…

గోదావరి లోయ గర్భంలో దాదాపు 21,464 మిలియన్ టన్నుల అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం నిర్ధారించింది. ఈ భారీ నిల్వలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే బొగ్గు నిక్షేపాల పరంగా ఆరో స్థానంలో నిలిచింది.
