FLIGHT ! గన్నవరం, ఆంధ్రప్రభ: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్–విజయవాడ–సింగపూర్ విమాన సేవలు శనివారం పునఃప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడ విమానాశ్రయం ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఐదేళ్ల తర్వాత విమాన సర్వీసులు ప్రారంభించిన ఇండిగో.. ఇక పై వయబులిటీ గ్యాప్ ఫండింగ్ లేకుండానే వారంలో మంగళ, గురు, శనివారాల్లో సింగపూర్‌కు సర్వీసులు నడపనున్నారు.



