Simplicity | జిల్లాకు క‌లెక్ట‌రైనా..

Simplicity | జిల్లాకు క‌లెక్ట‌రైనా..

Simplicity | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆరవలింగం నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న రు. అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లో ఉన్న భక్తులకు అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు.

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాకు ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ సామాన్య భక్తులతో కలిసి క్యూలైన్లో వారితోపాటు 20 నిమిషాలు నడిచి శ్రీశైలం అమ్మవారి దర్శనం చేసుకోవటం విశేషం. ఆరవ రోజు అయిన శుక్రవారం శ్రీశైల మహా పుణ్య క్షేత్రంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఉచిత క్యూ లైన్ ద్వారా సాధారణ భక్తులతో కలిసి వెళ్లి సుమారు 20 నిమిషాల్లో దర్శనం చేసుకున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, ఉచిత దర్శన క్యూ లైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, శానిటేషన్, వైద్య సదుపాయాలను భక్తులతో క్యూలైన్లో వెళ్లి పరిశీలించరు.

Simplicity
Simplicity

క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశిస్తూ ఇబ్బందులను భక్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక దర్శనాల కంటే సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ, ఉచిత క్యూ లైన్ ద్వారా తక్షణ దర్శనం కల్పించిన దేవస్థాన అధికారులు. భక్తులు శాంతి, నియమ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్. క్యూ లైన్ లో వెళ్లి అమ్మవారి దర్శనంతో పాటు తాగునీరు, లడ్డు ప్రసాదాన్ని కూడా పరిశీలించారు. భక్తులు కూడా తమతో పాటు క్యూ లైన్‌లో వచ్చిన కలెక్టర్ ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపటం విశేషం.

click here to read more : 6th day | ప్రత్యేక కార్యక్రమాలు..

click here to read more

Leave a Reply