Silver Medal | శభాష్ శశాంక్…
Silver Medal | శభాష్ శశాంక్…
- ఏషియన్ ఛాంపియన్ షిప్ సిల్వర్ మెడల్ విన్నర్ కు సీఎం ప్రశంస
Silver Medal | వెలగపూడి, ఆంధ్రప్రభ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఈక్వేస్టేరియన్(Equestrian) ఈవెంటింగ్ క్రీడాకారుడు శశాంక్ కనుమూరి కలిశారు. థాయ్ పొలో క్లబ్(Thai Polo Club) ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్ షిప్ -2025లో భారత్ తరుపున పాల్గొన్న శశాంక్ టీం సిల్వర్ మెడల్(Silver Medal) గెలుచుకోవడంపై సీఎం చంద్రబాబు అభినందించారు.

గుర్రాలతో హర్డిల్స్ దాటే ఈక్వేస్టేరియన్ ఈవెంటింగ్ క్రీడలో తనకు పదేళ్ల అనుభవం ఉందని క్రీడాకారుడు శశాంక్ ముఖ్యమంత్రికి తెలిపారు. భారత్ తరుపున పాల్గొన్న తమ టీంకు సిల్వర్ మెడల్ వచ్చిందని శశాంక్ వివంరించారు. భీమవరానికి చెందిన శశాంక్ కనుమూరి మరింతగా రాణించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

