SI | క్షేమంగా వెళ్లండి..

SI | క్షేమంగా వెళ్లండి..

  • గుడివాడ రూరల్ ఎస్సై చంటిబాబు

SI | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ రూరల్ ఎస్సై చంటిబాబు, సిబ్బంది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గుడివాడకు వచ్చేవారికి, పండుగ సంబరాలు ముగించుకుని తిరిగి ప్రయాణమయ్యే ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణకు తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు ప్రజలకు ముఖ్యంగా క్రింది రోడ్డు భద్రతా సూచనలు తెలియజేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్ ప్రయాణికులు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.

అధిక వేగంతో వాహనాలు నడపకూడ‌ద‌ని, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదన్నారు. రాత్రి ప్రయాణాల్లో హెడ్‌లైట్స్ సరిగ్గా ఉపయోగించాలని, చిన్నారులను వాహనాలపై సురక్షితంగా కూర్చోబెట్టాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పండుగ ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యానికి చేరుకుని ఈ పండుగను సంతోషంగా ముగించాలని గుడివాడ రూరల్ పోలీసులు కోరారు.

Leave a Reply