శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్యాంసుందర్ ముదిరాజ్..

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్యాంసుందర్ ముదిరాజ్..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపుర్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా దేప శ్యామసుందర్ ముదిరాజ్ ను నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఫారసు, మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కమిటీని నియమించారు. చైర్మన్ గా దేప శ్యాంసుందర్ ముదిరాజ్, ధర్మకర్తలుగా దౌడి లింగస్వామి, సిల్వర్ శంకర్, జెరిపోతుల అఖిల మహేందర్ ను నియమించారు.
ఈ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్యాంసుందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఈ కమిటీ నియమించడానికి సహకరించిన స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు పబ్బు రాజు గౌడ్, ఉప సర్పంచ్ మీసాల నర్సింహ, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సుక్క రవీందర్ తదితర నాయకులు, ప్రజాప్రతినిధులుకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
