వెబ్ సిరీస్‌లు చాలా ట్యాలెంట్‌ని బయటకు తెస్తున్నాయి. అదే కోవలో బయటి ప్రపంచానికి పరిచయం అయింది శ్రేయ చౌదరి. బాండిష్ బాండిట్స్ వెబ్ సిరీస్‌లో అద్భుత నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, సీక్వెల్లోను తనదైన ముద్ర వేసింది.
బాండిష్ బాండిట్స్ 2 , ది మెహతా బాయ్స్ (బొమన్ ఇరానీ దర్శకుడు) ఇంతకుముందు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రీమియర్ అయ్యాయి. గత ఏడాది తనకు బాగా కలిసొచ్చిన సంవత్సరం అని ఆనందంగా చెప్పింది శ్రేయా. ఇక ఈ భామకు సోషల్ మీడియాల్లోను అసాధారణంగా ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఇన్ స్టాలో వేడెక్కించే స్పెషల్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.
తాజాగా శ్రేయా షేర్ చేసిన ఓ ఫోటోషూట్ వీక్షించగానే, వెబ్ సిరీస్ క్వీన్ జియా ఖాన్ అంత హాట్ గా, బోల్డ్ గా ఉందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. శ్రేయా బ్లాక్ సెమీ బికినీలో టూ మచ్ బోల్డ్ గా కనిపించింది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.








