విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం, ఆంధ్ర ప్రభ బ్యూరో : విజయనగరం పట్టణంలో ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నఅఖిల భారత డ్వాక్రా బజార్(Dwakra Bazaar) (సరస్-2025)కి నిర్వహణకు పకడ్బంధీంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి(Ramsundar Reddy) ఆదేశించారు.
సరస్, ఫల పుష్ప ప్రదర్శన కోసం స్థానిక మాన్సాస్ గ్రౌండ్‌లో జరుగుతున్నఏర్పాట్లను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్(Collector) ఆదేశించారు. సందర్శకులు ఇబ్బంది పడకుండా చూడాలని, ముఖ్యంగా వాహనాల పార్కింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతీ ఏటా నిర్వహిస్తు న్నట్టుగానే ఈ ఏడాది కూడా సరస్ నిర్వహించాలని, డ్వాక్రా సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువుల ప్రదర్శనలు, అమ్మకాలు(Sales) సజావుగా జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అదేవిధంగా ఇదే స్థలంలో ఏర్పాటు చేయనున్నఫలపుష్ప(Phalapushpa) ప్రదర్శన వినూత్నంగా నిర్వహించేలా చూడాలని సూచించారు. విజయనగరం(Vijayanagar) ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నసరస్, పుష్ప ప్రదర్శనలను విజయవంతం చేయాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ పర్యటనలో డిఆర్‌డిఏ ఏపిడి కె.సావిత్రి( DRDA APD K. Savitri), మున్సిపల్ కమిషనర్ పి.నల్లనయ్య, ఏపిఈపిడిసిఎల్ ఎస్ఈ లక్ష్మణరావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, ఉద్యానశాఖ డిడి కె.చిట్టిబాబు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
