Shobitha Dhulipala | శోభిత నమ్మకం నిజమయ్యేనా…?

Shobitha Dhulipala | శోభిత నమ్మకం నిజమయ్యేనా…?

Shobitha Dhulipala | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శోభితా ధూళిపాళ నటించిన క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో. ఇందులో సంధ్య అనే పాత్రలో కనిపించబోతుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ ను సురేష్‌ ప్రొడక్షన్స్ (Suresh Productions) బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించారు. శరణ్‌ కొపిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ నెల 23 ప్రైమ్ వీడియోస్ ద్వారా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన చీకటిలో క్రైమ్ థ్రిల్లర్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి.. ఈ ట్రైలర్ ఎలా ఉంది..?

Shobitha Dhulipala | హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో

శోభితా ధూళిపాళ సంధ్య అనే పాత్రలో సరికొత్త పాత్రలో కనిపిస్తారు. సంధ్య ఒక క్రైమ్ (Crime) పాడ్‌కాస్టర్. 20 ఏళ్ల క్రితం జరిగిన వరుస హత్యల వెనుక ఉన్న రహస్యాలను, ఒక సీరియల్ కిల్లర్ ఆచూకీని తన పాడ్‌కాస్ట్ ద్వారా కనిపెట్టడానికి ఆమె ప్రయత్నిస్తుంది. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించగా, చైతన్య విశాలాక్షి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. పాడ్ కాస్ట్ ద్వారా కిల్లర్‌ను బయటకు రప్పించడానికి చేసే ప్రయత్నం, దాని వల్ల ఆమె ఎదుర్కొనే ప్రమాదాలను ఇందులో చూపించారు. నిజం గెలుస్తుందా? లేక సంధ్య ఆ కిల్లర్‌కి బలి అవుతుందా? అనేది ఉత్కంఠగా చూపించనట్టుగా ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

Shobitha Dhulipala

Shobitha Dhulipala | దర్శకుడు శరణ్ కొపిశెట్టి మాట్లాడుతూ..

ఈ సినిమా తీయడం నాకు ఒక మంచి అనుభవం. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ (Crime Story) మాత్రమే కాదు, భయం లేకుండా నిజం కోసం పోరాడే ధైర్యం గురించి చెప్పే కథ. మా సినిమాను ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. నటీనటులందరూ అద్భుతంగా నటించారు అన్నారు.

Shobitha Dhulipala | కథానాయిక శోభితా ధూళిపాళ మాట్లాడుతూ..

సంధ్య పాత్రలో నటించడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఆమె ఎవరి మాటా వినకుండా, తనకి నచ్చింది చేసే ఒక స్వతంత్రమైన అమ్మాయి. నేను కూడా తెలుగు అమ్మాయిని కావడంతో, హైదరాబాద్ (Hyderabad) నేపథ్యంలో సాగే ఈ పాత్ర చేయడం చాలా సహజంగా అనిపించింది. మేడ్ ఇన్ హెవెన్ తర్వాత మళ్ళీ ప్రైమ్ వీడియోతో కలిసి పని చేయడం, చీకటిలో వంటి మంచి సినిమాలో భాగం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. జనవరి 23న మీరందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.

Shobitha Dhulipala

CLICK HERE TO READ స్వయంభు వచ్చేది ఎప్పుడు..?

CLICK HERE TO READ MORE

Leave a Reply