Shiva’s | ఉమామహేశ్వర క్షేత్ర కొండపై వెలసిన శివస్వరూపం

Shiva’s | ఉమామహేశ్వర క్షేత్ర కొండపై వెలసిన శివస్వరూపం
ఉమామహేశ్వరంలో శివస్వరూపం పునరుద్ధరణ
భక్తుల్లో వెలి విరుస్తున్న ఆనందోత్సాహం
Shiva’s | అచ్చంపేట , ఆంధ్రప్రభ: శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరుగాంచిన రంగాపురం గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో విశేష ఘట్టం చోటుచేసుకుంది. స్వామివారి గర్భగుడికి ముందు కొండపైన గతంలో సుమారు 30 సంవత్సరాల క్రితం లింగ స్వరూపంగా త్రిశూలధారణతో రూపొందించిన సాక్షాత్తు శివస్వరూపం డిజైన్‌ను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కృషితో తాజాగా పునరుద్ధరించినట్లు ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈవో శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలు తెలిపారు.
ఈ పునరుద్ధరణతో లింగ స్వరూపమైన త్రిశూలధారణ కలిగిన శ్రీ ఉమామహేశ్వర దర్శనం ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు విద్యుత్ దీప కాంతుల వెలుతురులో దర్శనమిస్తోంది. కొండపై వెలుగుల మధ్య మెరిసిపోతున్న ఈ శివస్వరూపం దర్శనం అచ్చంపేట వై జంక్షన్‌తో పాటు డిండి ప్రాంత వాసులకు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో భక్తుల్లో భక్తి ఉత్సాహం మరింత పెరిగింది. శివస్వరూపం పునరుద్ధరణతో ఆలయానికి కొత్త శోభ చేకూరిందని ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు అభిప్రాయపడుతున్నారు. రాత్రివేళ వెలుగుల మధ్య దర్శనమిచ్చే ఈ శివాకృతి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది.

