Shivaji Patil | సోపూర్ లో ఉచిత గర్భకోశ పశువైద్య శిబిరం

Shivaji Patil | సోపూర్ లో ఉచిత గర్భకోశ పశువైద్య శిబిరం
Shivaji Patil | జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : పశుసంవర్ధక, పశువైద్యశాఖ ద్వారా గోపాలమిత్ర (డీఎల్ డీఏ) ఆధ్వర్యంలో సోపూర్ లో పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సల శిబిరాన్ని నిర్వహించగా, గ్రామ సర్పంచ్ జి.తుకారం, ఉప సర్పంచ్ భర్త హన్మంత్, మాజీ సర్పంచ్ శివాజీ పాటిల్ ఇట్టి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పశువైద్య అధికారి పండరినాథ్, జేవిఓ అబ్దుల్ మాజిద్ ఆధ్వర్యంలో పలు గేదలకు, ఆవులకు గర్భకోశ చికిత్సలు నిర్వహించారు. గొర్రెలకు, మేకలకు బొబ్బరోగం నివారణ టీకాలు ఇవ్వటం జరిగింది. పశువులకు పౌష్టికాహారంతో పాటు మందులను ఉచితంగా సరఫరా చేశారు. ఈ సందర్భంగా గోపాలమిత్రలు రాములు, అంజయ్య, రవీందర్, సంజీవ్ రెడ్డి, ముగాజీవల పెంపకందారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
