Shivaji | వివాదం.. ముగిసిందా… ముదిరిందా.. ?

Shivaji | వివాదం.. ముగిసిందా… ముదిరిందా.. ?

Shivaji | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : డండోరా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్ ఎంతలా వివాదస్పదం అయ్యాయో తెలిసిందే. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యల పై నటుడు శివాజీ(Actor Sivaji on comments) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన భావోద్వేగంతో క్షమాపణ చెప్పారు. వేదిక పై తాను రెండు అనుచితమైన పదాలు ఉపయోగించినందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని శివాజీ తెలిపారు. స్టేజ్‌పై(On stage) నుంచి దిగిన వెంటనే తన తప్పు ఎంత పెద్దదో తనకు అర్థమైందని, ఆ మాటలు చెప్పడం పూర్తిగా తప్పేనని ఆయన అంగీక‌రించారు. అయితే.. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా కాకుండా.. మరింత ముదిరేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. శివాజీ మళ్లీ ఏం మాట్లాడారు..? అసలు ఏం జరిగింది..

Shivaji | ఆ విషయంలో బాధపడ్డాను..

Shivaji

న‌టుడు శివాజీ మాట్లాడుతూ… నేను ఆరోజు స్టేజీ మీద ఉన్న నా తోటి న‌టీన‌టుల‌కు, ఆడ‌బిడ్డ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు(Apologies) చెబుతున్నాను. ఆ రెండు ప‌దాల‌ను మాట్లాడకుండా ఉండాల్సింది. జీవితంలో అలా ప‌దాల‌ను ఎప్పుడూ దొర్ల‌లేదు. నేను ఇక్క‌డ‌కు వ‌చ్చి 30 సంత్స‌రాల‌వుతుంది. అలాగూ పాలిటిక్స్‌(Politics)లో ఉన్న‌ప్ప‌టికీ ఏ రోజు కూడా ఏ మ‌హిళ‌ను, పార్టీనూ హ‌ద్దు దాటి మాట్లాడ‌లేదు. అలాంటిది భ‌గ‌వంతుడు ఎందుకో అలా చేశాడు. ప‌దాలు అలా దొర్లిపోయాయి. ఆ విష‌యంలో చాలా బాధ‌ప‌డ్డాను. ఆ రెండు ప‌దాల‌కు మీ అంద‌రికీ సిన్సియ‌ర్‌గా(Sincerely) క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు క‌ట్టుబ‌డే ఉన్నాను. దాంట్లో ఎవ‌రికీ భ‌య‌ప‌డేది లేదు. ఆ రెండు పదాలు మాత్రం అన్‌పార్ల‌మెంట‌రీ వర్డ్స్‌(Unparliamentary Words). కాబ‌ట్టి నా గుండె సాక్షిగా చెబుతున్నాను. చాలా బాధ‌ప‌డుతున్నాను. అలా మాట్లాడ‌టం త‌ప్పు అని చెప్పారు.

Shivaji | అంత‌ర్మ‌థ‌నానికి లోన‌య్యాను..

Shivaji

నేను 36 గంట‌లైంది. స‌రిగ్గా నిద్ర‌పోయి.. నా పై న‌మ్మ‌కంతో నిర్మాత నాకు అవ‌కాశం ఇస్తే.. ఇలా ఎందుకు జ‌రిగింద‌ని నాలోనే అంత‌ర్మ‌థ‌నానికి(For contemplation) లోన‌య్యాను. దండోరా సినిమా డిసెంబ‌ర్ 25 రిలీజ్. కాబ‌ట్టి సినిమా ప్ర‌మోష‌న్‌కు వ‌స్తాన‌ని ప్రొడ్యూస‌ర్‌ గారికి చెప్పాను. దండోరా సినిమాను మీకు ద‌గ్గ‌ర‌గా ఉన్న థియేట‌ర్స్‌లో చూడండి. స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తోన్న కుల వ్య‌వ‌స్థ మీద‌.. ప్రేమ ప‌ట్ల వ్య‌తిరేక‌త త‌ర‌త‌రాలుగా న‌డుస్తోంది.. భ‌విష్య‌త్తులోనూ(In the future too) న‌డుస్తుంది. వాటిని గ‌ట్టిగా స్పృశిస్తూ.. అలాగే అస‌మాన‌త‌ల‌ పై తీసిన సినిమా. అయినా.. మ‌నుషులు మార‌రు. ఎన్నోసార్లు చెప్పే ఉంటారు. అయినా మ‌నుషులు మార‌రు. మార‌తార‌నే ఆశ‌తో ప‌ని చేసుకుంటూ వ‌చ్చే త‌రాల‌కు మంచిని అందించాలనే ఉద్దేశంతో, మంచి క‌థ‌తో చేసిన సినిమా ఇది అని చెప్పారు.

Shivaji | అలా మాట్లాడడానికి కారణం..

Shivaji

సినిమా ఇండ‌స్ట్రీలో(In the film industry) అలాంటివి చేయొద్దు మీరు. సినిమాల్లో ఎలాగైనా చేసుకోవ‌చ్చు. కానీ బ‌య‌ట‌ అలాంటివి చేయ‌టం వ‌ల్ల‌, బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు మీరు ఇబ్బందుల‌కు గుర‌వుతార‌ని ఎంతో మంది ప‌దే ప‌దే పెద్ద‌వాళ్లు, సంస్కృతి సంప్ర‌దాయాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న‌వాళ్లు జ‌న‌రేష‌న్స్‌కు చెబుతూ వ‌చ్చారు. నేను అలా మాట్లాడ‌టానికి కార‌ణం. ఇటీవ‌ల లులూ మాల్‌లో నిధి అగ‌ర్వాల్(Nidhi Agarwal) ప‌డ్డ వేద‌న‌.. త‌ను కారులోకి వ‌చ్చిన త‌ర్వాత ఎంత ఇబ్బందిక‌రంగా ఫీల్ అయ్యిందో నా మైండ్‌లో నుంచి పోలేదు. ఆ త‌ర్వాత స‌మంత‌ గారు కూడా అలాంటి ఇబ్బందే ప‌డ్డారు. నేను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌ర్వాత 90 శాతం మంది ఫిమేల్ ఆర్టిస్టులు జ‌య‌సుధ‌ గారు, విజ‌య‌శాంతి గారు, ర‌మ్య‌కృష్ణ‌ గారు..క‌ట్టుకున్న మోడ‌ల్ చీర‌ల‌ని చెప్పి షాప్స్‌లో అమ్మేవారు.

Shivaji | న‌మ్మ‌బుద్ధి కావ‌టం లేదు..

Shivaji

నేను ఈ డ్రెస్సులు వేసుకోండి.. ఆ డ్రెస్సులు వేసుకోండి.. మీరు కప్పేసుకోండ‌ని ఎవ‌రికీ చెప్ప‌లేదు. నేను ఎవ‌ర్నీ చెప్ప‌టానికి. స‌మాజంలో ఏ రుగ్మ‌త వ‌చ్చినా కానీ.. స‌మాజం సినిమా(Society movie) వ‌ల్ల చెడిపోతుంద‌ని, మీరు వేసుకునే డ్రెస్సుల వ‌ల్ల చెడిపోతుందని అంటున్నారు. సినిమా వ‌ల్ల‌నే ప్రపంచం నాశ‌నం అవుతుంద‌నే మాట‌లు వింటున్నాం. ఇక్క‌డే బ్ర‌తికి, ఇక్క‌డ వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే నా పిల్ల‌ల‌ను చ‌దివించుకుంటున్నా. సినిమాను ఎవ‌రూ ఏమీ అనకూడ‌ద‌నే ఆలోచ‌న‌తో మాట్లాడానంతే. అస‌లు ఆ రెండు ప‌దాల‌ను నా నోటి నుంచి ఎందుకొచ్చాయ‌నేది ఇప్ప‌ట‌కీ న‌మ్మ‌బుద్ధి కావ‌టం లేదు.

Shivaji | ఆమె అర్థం చేసుకున్నారు..

Shivaji

ఈ విష‌యంలో నా భార్య‌కు నేను ముందు క్ష‌మాప‌ణ‌లు(Apologies) చెప్పాను. అస‌లు ఏ స్టేట‌స్‌లో ఈ మాట‌లు మాట్లాడావ‌ని అంది. రేపు నా పిల్ల‌లు వాళ్ల ఫ్రెండ్స్ ద‌గ్గ‌ర ఇబ్బంది ప‌డ‌కూడ‌దు. రాత్రి పన్నెండు త‌ర్వాత ట్వీట్స్ చిన్మ‌యి గారికి, అన‌సూయ‌ గారికి ట్యాగ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కు, ఏపీ ప్ర‌భుత్వానికి, తెలంగాణ ప్ర‌భుత్వానికి, మ‌హిళా క‌మీష‌న్‌(Women’s Commission)కు లేఖ‌లు పంపేశారు. న‌న్ను ఒక్క మాట కూడ అడ‌గ‌లేదు. సుప్రియ‌ గారు మాత్ర‌మే మాట్లాడారు. నేను ఆమెకు సారీ చెప్పాను. త‌ప్పుగా మాట దొర్లింద‌ని చెప్పాను. ఆమె అర్థం చేసుకున్నారు.

Shivaji | నేనేం సిగ్గు ప‌డ‌ను..

Shivaji

మనం అందరం బూతులు మాట్లాడుకుంటాం. కానీ స్టేజ్‌ పై ఉన్న‌ప్పుడు, మాట్లాడేట‌ప్పుడు ఓ ప‌ద్ధ‌తి ఉంటుంది. నేను ఎవ‌రితోనూ మిస్ బిహేవ్(Miss Behave) చేయ‌లేదు. ఇప్పటికీ భూమిక‌ గారితో మాట్లాడుతాను. ఆమెను మేడ‌మ్ అనే పిలుస్తాను. ల‌య‌ను ల‌య‌మ్మ అంటాను. రంభ‌ గారు, సంఘ‌వి గారితో చేశాను. ఏరోజు ఎవ‌రితోనూ మిస్ బిహేవ్ చేయలేదు. ఎందుకంటే.. ఏదో ఒక‌రోజు ఇదే మ‌న‌కు గుదిబండై కూర్చుంటుంది. జ‌రిగిన త‌ప్పుకి వివ‌రణ ఇవ్వాల్సిన బాధ్య‌త నాపై ఉంది. నేను మాట్లాడిన ఇంటెన్ష‌న్(Intention) వేరు. జ‌డ్జ్ అయినా ఎవ‌రైనా ఇంటెన్ష్ చూస్తారు. అమ‌రావ‌తి రైతుల‌పై బూటు కాలు వేసి తొక్కిన‌ప్పుడు నేను మాట్లాడాను. నేను నిల‌బ‌డ్డాను. ఎన్నో సంద‌ర్భాలో నిల‌బడ్డాను. నేను క్ష‌మాప‌ణ చెప్పాన‌ని అన్న‌ప్ప‌టికీ ఉమెన్ క‌మీష‌న్(Women’s Commission) వాళ్లు డిసెంబర్ 27న ర‌మ్మ‌ని చెప్పారు. ప‌ర్లేదు.. నేను వెళ్లి క్ష‌మాప‌ణ లేఖ ఇస్తాను. నేనేం సిగ్గు ప‌డ‌ను అని చెప్పాడు. మరి.. ఈ వివాదం ముగుస్తుందో.. మరింతగా ముదురుతుందో చూడాలి.

CLICK HERE TO READ తారక్ -త్రివిక్రమ్ మధ్య గొడవ జరిగిందా…?

CLICK HERE TO READ MORE

Leave a Reply