Shiva temple | ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి

Shiva temple | ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి
ఎంపీ కేశినేని శివనాథ్..
రాయనపాడులో శ్రీ సోమేశ్వర స్వామి వారి శివ మందిరంలో విగ్రహా ప్రతిష్ట హోత్సవం..
ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్…
ఆలయంలో ప్రత్యేక పూజలు..
Shiva temple | విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుడి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రసరించాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. విజయవాడ రూరల్ మండలం రాయనపాడు గ్రామంలో చెరువు వద్ద నిర్మించిన శ్రీ సోమేశ్వర స్వామి వారి శివాలయంలో బుధవారం నిర్వహించిన శివలింగం, నందీశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, అర్చకులు వేదమంత్రాల నడుమ ఆలయ మర్యాదలతో ఎంపీ కేశినేని శివనాథ్‌కు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన స్వామివారిని దర్శించుకుని రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన గ్రామ పెద్దలు, దాతలను అభినందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సానుకూల భావాలను పెంపొందిస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు భక్తి, ఐక్యతకు ప్రతీకలని ఎంపీ పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాయనపాడు సర్పంచ్ కాటంనేని పూర్ణ, రాయనపాడు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ శీలంనేని సాంబశివరావు ఎన్టీఆర్ జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడు గూడపాటి పద్శ శేఖర్, జనసేన మైలవరం ఇన్చార్జ్ అక్కల గాంధీ, గొల్లపూడి గ్రామ టిడిపి ప్రెసిడెంట్ నూతలపాటి నారదలతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.


