DEAD| వరిధాన్యం తిని గొర్రెలు మృతి

DEAD| చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుద్దాల, తుర్కపల్లి గ్రామాలకు చెందిన పలువురుకి చెందిన గొర్రెలు వరి కల్లలలోని ధాన్యాని తిని మృతి చెందాయి. సుద్దాల గ్రామానికి చెందిన గానవోయినా పోచయ్య, తుర్కపల్లి గ్రామానికి చెందిన బట్టి శ్రీశైలం, అక్కల పోచయ్య లకు చెందిన సుమారు వంద గొర్రెలు మృత్యువత పడ్డాయి.
