ఈమె మరో రాములమ్మ…

  • పండంటి బిడ్డకు జన్మనిచ్చింది

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో.. ఓ రాములమ్మ కథ తెరమీదకు వచ్చింది. ప్రియుడి కౌగిట్లో నలిగి.. అత్యంత రహస్యంగా తొమ్మిది నెలలు గర్భం మోసి.. కడకు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ మైనరు కథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం తిమ్మాపురం గ్రామానికి ఓ కూలీనాలీ దంపతులు తమ బిడ్డను ఆపురూపంగా పెంచుకున్నారు. తమ స్థాయికి తగినట్టుగానే బాగా చదివించారు.

ఆమె ఇంటర్మీడియట్ వరకూ చదివింది. ఆ తరువాత నంద్యాలలోని ఓ నర్పింగ్ కాలేజీలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. శుక్రవారం అకస్మాత్తుగా కడపులో నొప్పి అని గోల చేస్తుండగా.. తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. ఆమె నిండుగర్భిణీ అని వైద్యులు తేల్చి చెప్పారు. అంతలోనే ఆమె ప్రసవించింది. ఇక అసలు కథ వెలుగులోకి వచ్చింది.

బొల్లవరం గ్రామానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడితో ఈ బాలికకు పరిచయం ఏర్పడింది. ప్రేమగా మారింది. ఇద్దరూ దగ్గర కావటంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసినా 9 నెలలు నిండే వరకు కుటుంబ సభ్యులకు చెప్సలేదు. అంత్యక గోప్యత పాటించింది. తమ బిడ్డను గర్భవతిని చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రుడు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply