Shamshabad Airport : పలు విమానాల దారిమళ్లింపు

శంషాబాద్ : ఎయిర్‌పోర్ట్‌ (Shamshabad Airport)లో వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ రావాల్సిన పలు విమానాల (Many planes)ను దారి మళ్లించారు. గత రెండు రోజుల నుంచి నగర వ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో పాటు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే నగరం మొత్తం నల్లని మేఘాలు కమ్ముకోవడంతో.. విమానాల ల్యాండింగ్ కు వాతావరణం అనుకూలంగా (Climate problem) లేకుండా పోయింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు వెంటనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కు వస్తున్న విమానాలను.. దారి మళ్లించారు.

ఇప్పటి వరకు మూడు విమానాలు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ (Bangalore Airport)కు మళ్లించడంతో అవి అక్కడే ల్యాండ్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తుంది హైదరాబాద్ చేరాల్సిన తమను బెంగళూరుకు తీసుకురావడంపై విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగగా.. పరిస్థితులను వివరించడంతో ప్రయాణికులు శాంతించినట్లు తెలుస్తుంది. కాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన విమానాల దారిమళ్లింపుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply