పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ..

కామారెడ్డి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెల్మ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మనుమడు ఇసాన్ చంద్ర మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని బాబును ఆశీర్వదించారు.
ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఆయనతో పాటు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలియాస్, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బంధుమిత్రులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
