Rajendranagar | బాలికపై లైంగిక దాడి.. నిందితుడిని అరెస్టు

రాజేంద్రనగర్, ఆంధ్ర‌ప్ర‌భ : శంషాబాద్ (Shamshabad) మున్సిపాలిటీ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేష‌న్ ప‌రిధి బెంగళూరు జాతీయ రహదారి బ్రిడ్జి (Bangalore National Highway Bridge) కింద ప‌దేళ్ల‌ బాలికపై లైంగిక దాడి జ‌రిగింది. గుజరాత్ (Gujarat) రాష్ట్రానికి చెందిన సంజయ్ (Sanjay) అలియాస్ ఇర్ఫాన్ హుస్సేన్ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం శంషాబాద్ కు వలస వచ్చాడు.

మంగళవారం తెల్లవారుజామున అతడు మద్యం మత్తులో శంషాబాద్ పట్టణంలోని ఇందిరా హాస్పిటల్ (Indira Hospital) ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద పదేళ్ల బాలికపై లైంగిక దాడికి వడిగట్టాడు. స్థానికులు కుటుంబ సభ్యుల సమాచారంతో ఇన్‌స్పెక్ట‌ర్ బాలరాజు (Inspector Balaraju) తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలు స్థానికంగా కుటుంబ సభ్యులతో కలిసి యాచిస్తూ జీవనం సాగిస్తూ ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంద‌ని పోలీసులు తెలిపారు. బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన పరీక్షలు నిర్వహించగా బాలికపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు.

Leave a Reply