Election | త‌హ‌సీల్దార్ ఎదుట పలువురి బైండోవర్

Election | గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో

Election | త‌హ‌సీల్దార్ ఎదుట పలువురి బైండోవర్ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో పాత కేసుల్లో ఉన్నవారిని గ్రామపంచాయతీ ఎన్నికల్లో నేపథ్యంలో పలువురిని ఊట్కూర్ తహసీల్దార్ చింతా రవి ఎదుట సోమవారం బైండోవర్ చేశారు. మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామానికి చెందిన 14 మంది, బిజ్వార్‌కు చెందిన ఏడుగురిని పోలీసులు త‌హసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.

ఈ సందర్భంగా త‌హసీల్దార్ చింత రవి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనంతరం వారిని సొంత పుచ్చికత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజ నరసయ్య గౌడ్, మాతృ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply