ఏడుగురికి గాయాలు..

  • ముగ్గురి పరిస్థితి విషమం…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా లోని అవుకు మండలం పాత చర్లోపల్లి బస్టాండ్(Old Charlopally Bus Stand) వద్ద గురువారం ఆటో బొలెరో వాహనం ఢీకొని ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. రామాపురం, చెర్లోపల్లి గ్రామాలకు చెందిన కొందరు ఆటోలో అవుకు వస్తుండగా బొలెరో వాహనం ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్నఆనంద్ శర్మ(Anand Sharma traveling in an auto), నులక రాముడు, ఆటో డ్రైవర్ లతీఫ్ భాష(auto driver Latif Bhasha) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.వీరిని మెరుగైన వైద్యం(medical) కొరకు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా నలుగురికి(four persons) స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అవుకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply