ఏడుగురు మృతి..

వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలో బుధ‌వారం పిడుగు పాటుకు ఏడుగురు బ‌ల‌య్యారు. ఆయా కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. జోగులాంబ గ‌ద్వాల్ జిల్లాలో ముగ్గురు, నిర్మ‌ల్ జిల్లాలో ముగ్గురు, ఖ‌మ్మం జిల్లాలో ఒక‌రు మృతి చెందారు. మ‌రొక‌రు గాయ‌ప‌డ్డారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి తీస్తున్న కూలీలపై పిడుగుపడడంతో ముగ్గురు మృతిచెందిన విషాదకర ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురంలో చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాతపడ్డారు.

మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులను సౌభాగ్య, పార్వతి, సర్వేష్‌గా గుర్తించారు. నిర్మల్‌ జిల్లాలోని పెంబి మండలంలోని గుమ్మనా ఎంగ్లాపూర్‌ గ్రామంలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.

బండారు వెంకటి, భార్య భర్తలు అల్లెపు ఎల్లయ్య, అల్లెపు ఎల్లవ్వ మక్క చేను కాపలాకు వెళ్లగా బుధవారం వర్షం కురవడంతో మంచం మీద ఉన్నారు. ఉరుములతో మెరుపులతో వర్షం కురిసి పిడుగు మంచం మీద పడటంతో ముగ్గురు మృతి చెందారు.

మృతుల్లో ఇద్దరు భార్యభర్త‌లు ఉన్నారు. ఖమ్మం జిల్లా ఆరేపల్లి మండల పరిధిలోని మేకల తండా గ్రామం గూగులోతు మోహన్‌ రావుకు చెందిన ఆవు పిడుగుపడగా మృతి చెందింది.

అదేవిధంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యానారాయణపురంలో పిడుగుపాటుకు రైతు మృతిచెందాడు. కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి గ్రామ సమీపంలో మిరప తోటలో పనిచేస్తున్న రైతు గుగులోతు బావుసింగ్‌ పై పిడుగు పడి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పక్కనే ఉన్న స్థానిక రైతులు, కుటు-ంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply