Mulugu | మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. 20మంది అరెస్ట్, 8మంది లొంగుబాటు

వాజేడు, మే 17 ఆంధ్రప్రభ : ములుగు జిల్లా పోలీసులు భారీగా మావోయిస్టులను అరెస్టు చేసి మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ కొట్టారు. ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సుమారు ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోగా, మరో 20మంది అరెస్ట్ అయ్యారు.

తెలంగాణ-చత్తీస్ ఘడ్ సరిహద్దుల సమీపంలో గల వెంకటాపురం, వాజేడు, పేరూర్, పోలీస్ స్టేషన్ పరిధిలోగల కర్రే గుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్ నిర్వహించి మొత్తం 20మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శబరిష్ ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు ఈరోజు లొంగిపోయారు. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి నక్సలైట్లు సుముఖత చూపిస్తున్నారు.

పోలీసులు నిర్వహిస్తున్న పోరు కన్నా-ఊరు మిన్న.. మన ఊరుకి తిరిగి రండి అనే కార్యక్రమంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు 24 గంటల్లో వారీ ఆకౌంట్లో జమ చేస్తున్నామని ఎస్సీ శబరిష్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకి పునరావాసం కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి రవీందర్, ఏటూరునాగారం ఏ ఎస్పి శివ ఉపాధ్యాయ, వెంకటాపురం సిఐ బండార్ కుమార్, వాజేడు, వెంకటాపురం, పేరూరు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply