అమ్మ ఆలయంలో సేవాదారుల సేవలు..

  • విస్తృతం చేసేదిసిగా చర్యలు..
  • భవాని దీక్షల సమీక్షాసమావేశంలో దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్.

ఆంధ్రప్రభ విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనక దుర్గమ్మ వారి భవాని దీక్షలు విరమణల్లో వాలంటీర్స్ సేవలు విసృతంగా వినియోగించుకోవాలని, ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సేవకుల మొబైల్ ఫోన్ లకు సేవా కేటాయింపు మెసేజ్ త్వరితంగా పంపాలని ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ ఆదేశించారు.

శనివారం సాయంత్రం ఇంద్రకీలాద్రి క్షేత్రస్థాయి పర్యటన అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు అంశాలుపై ఆదేశాలు జారీ చేశారు. దీక్ష విరమణలు 5 రోజుల్లో అన్న ప్రసాదం, మంచి నీటి సరఫరా, వృద్ధుల, వికలాంగుల తదితర సేవల్లో సేవకుల వినియోగం ఉండాలని ఆదేశించారు.

గత భవాని దీక్షల్లో భక్తులకు అందుబాటులో ఉంచిన లడ్డులు కంటే రెండింతలు అందుబాటులో ఉంచాలని, మూడు లడ్డు తయారు కేంద్రాలు పూర్తి స్థాయిలో వినియోగించాలని కమిషనర్ ఆదేశించారు. భక్తులు వేచి ఉండేందుకు కీలక ప్రదేశాల్లో షామియానాలు వేయాలని, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లో ఇన్ఫర్మేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రామచంద్ర మోహన్ ఆదేశించారు.

పూర్తి స్థాయిలో భక్తులకు సంతృప్తికర సేవలు అందించేందుకు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, సాంకేతిక వినియోగంతో సులభతరంగా సేవాలందించాలని కోరారు. రైల్వే స్టేషన్, బస్ స్థాండ్ నుండి స్నాన ఘాట్ లకు కల్పిస్తున్న ఉచిత రవాణా సదుపాయాలు, క్లోక్ రూమ్ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షణ చేయాలని కమిషనర్ ఆదేశించారు.

ఈ సమావేశంలోఆలయం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి. కె. శీనా నాయక్, దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.

Leave a Reply