ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: జీఎస్టీ సంస్కరణల జోష్, భారత్‌పై సుంకాల ద్వితీయశ్రేణి ఆంక్షల విషయంలో ట్రంప్ నెమ్మదించడం, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చల్లో పురోగతి వంటి అంశాలు మార్కెట్ సూచీలపై సానుకూల ప్రభావం చూపాయి. ఉదయం 9.20 సమయంలో సెన్సెక్స్ 106 పాయింట్లు పెరిగి 81,379, నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 24,913 వద్ద కొనసాగుతున్నాయి. వర్ధమాన్ టెక్స్‌టైల్స్, లక్ష్మీ ఆర్గానిక్స్, వెల్స్పన్ లివింగ్ లాభాల్లో ఉండగా.. భారత్ డైనమిక్స్, గణేష్ ఎకోస్పేర్, అశోక్ లేల్యాండ్, పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ నష్టాల్లో ఉన్నాయి. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడింది. నేడు రూ.87.25 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. ఇక ఆసియా-పసిఫిక్ మార్కెట్ల ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ, ద.కొరియా కోస్పీ, ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్ 200, తైవాన్ సూచీలు నష్టాల్లో కదలాడుతుండగా.. చైనాకు చెందిన షాంఘై, హాంకాంగ్ హెచ్‌ఎస్‌ఐ సూచీలు లాభాల్లో ఉన్నాయి.
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
