హాంగ్‌కాంగ్ ఓపెన్ 2025 : దూసుకెళ్లారు…

హాంగ్‌కాంగ్ ఓపెన్ సూపర్ 500లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో మన స్టార్లు లక్ష్య సేన్, అలాగే డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లారు.

రెండేళ్ల త‌రువాత‌ లక్ష్య సేన్ రీ-ఎంట్రీ..
లక్ష్య సేన్ తిరిగి తన పాత ఫామ్‌ను చాటుకున్నాడు. 23 ఏళ్ల ఈ యువకుడు దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఒక ప్రధాన ఫైనల్‌కి అర్హత సాధించాడు. సెమీఫైనల్‌లో ప్రపంచ ర్యాంకింగ్‌లో 9వ స్థానంలో ఉన్న, మూడో సీడ్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను వ‌రుసు సెట్ల‌లో 23-21, 22-20 తేడాతో ఓడించి సత్తా చాటాడు.

2023లో కెనడా ఓపెన్ తర్వాత లక్ష్యకు ఇది తొలి పెద్ద ఫైనల్. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్‌లో 20వ స్థానంలో ఉన్న అతడు, ఇప్పుడు ఫైనల్‌లో చైనా స్టార్ లి షి ఫెంగ్‌తో తలపడనున్నారు.

సాత్విక్-చిరాగ్ జోడీ ఫైనల్‌కు..
ఈ సీజన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు సెమీఫైనల్స్‌లో ఆరు సార్లు ఓడిపోయిన సాత్విక్-చిరాగ్ జోడీ… ఈసారి అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. సెమీస్‌లో చైనీస్ తైపీ జోడీ లిన్ బింగ్ వెయి-చెన్ చెంగ్ కువాన్‌లను 21-17, 21-15 తేడాతో ఓడించారు. ఫైనల్‌లో ఈ జోడీ పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేతలైన లియాంగ్ వే కాంగ్ – వాంగ్ చాంగ్ (చైనా)తో తలపడనుంది.

Leave a Reply