సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కి విద్యార్థిని ఎంపిక

సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ కి విద్యార్థిని ఎంపిక

    కమ్మర్ పల్లి,ఆంధ్ర ప్రభ : సిఎం కప్ సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కి కమ్మర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్.డి బుష్రా ఎంపికైనట్లు పీడీ వేముల నాగభూషణం గురువారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20 నుండి 23వరకు మెదక్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటుందని తెలిపారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.సాయన్న సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్,ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్,విడిసి అధ్యక్షులు బోగ రామ స్వామి, సభ్యులు బుచ్చి మల్లయ్య,పాఠశాల ఉపాధ్యాయ బృందం,గ్రామ యువకులు,గ్రామ ప్రజలు విద్యార్థిని బుష్రా ను అభినందించారు.

    Leave a Reply