అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

5.1 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత
చౌక డిపో డీలర్ పై 6ఏ కేసు.. షాపు సీజ్

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: జీ,కొండూరులో అక్రమంగా నిల్వ ఉంచిన 5.1 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం పట్టుకున్నారు. గ్రామానికి చెందిన వ్యక్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చౌక దుకాణం నెంబర్ 0609003 డీలర్ పక్కన ఇంటిలో పీడీఎస్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందించాడు. దీంతో డీఎస్ఓ, ఏఎస్ వో, ఆర్ఐ తనిఖీలు చేసి 102 బస్తాలు అంటే సుమారు 5.1 టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. సదరు డీలర్ పై 6ఏ కేసు నమోదు చేసి షాపును సీజ్ చేయాల్సిందిగా జి.కొండూరు మండల పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ టి.మాధవిని పౌర సరఫరాల శాఖ అధికారి పి.వాణి ఆదేశించారు.

Leave a Reply