పోలీసులతో మాజీ పేర్ని నాని వాగ్వివాదం..

పోలీసులతో మాజీ పేర్ని నాని వాగ్వివాదం..
- జనసేన దిమ్మె విషయంలో పెరిగిన వివాదం
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మచిలీపట్నం రామానాయుడుపేట సెంటర్ లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో జనసేన, వైసీపీ నేతల మధ్య వివాదం పెరుగుతుంది. మరికాసేపట్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణకు జనసేన నేతలు సిద్ధమవుతున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పేర్ని నాని ఇంటి వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. పోలీసుల వలయాన్ని ఛేధించి జనసేన జెండా దిమ్మ దగ్గరకు వెళ్లే ప్రయత్నం పేర్ని నాని చేసారు.
పేర్ని నానిని అడ్డుకున్న పోలీసులపై పేర్ని నాని వాగ్వివాదానికి దిగారు. పోలీసులపై తీవ్ర కంఠంతో పేర్ని నాని విరుచుకుపడ్డారు. సెక్షన్ 30 ఉందని పోలీసులు చెప్పినా పేర్ని నాని వినలేదు. మీకు ఇష్టం వచ్చినప్పుడు సెక్షన్ 30 పెడతామంటే కుదరదని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. కొద్దిసేపు వాగ్వివాదం అనంతరం పేర్ని నాని కొంత వెనక్కి తగ్గారు.

