School | కూర లేదు.. కారంతోనే భోజనం

School | కూర లేదు.. కారంతోనే భోజనం
- పాపం!.. ఆ విద్యార్థులు ఎలా తింటున్నారో?
Mahbubabad | కొత్తగూడ, ఆంధ్రప్రభ : కూర లేదు.. కారంతోనే భోజనం పెడుతున్నారు… పాపం! ఆ విద్యార్థులు ఎలా తింటున్నారో!.. ఇదీ పోగుళ్లపల్లి ఏకలవ్య పాఠశాల విద్యార్థుల(School Students) దయనీయపరిస్థితి. మహబూబాబాద్ జిల్లా(Mahbubabad District) కొత్తగూడ మండలం పోగుళ్లపల్లిలో ఉన్న ఏకలవ్య పాఠశాలకు కూరగాయల పంపిణీ టెండర్ అయిపోయి దాదాపు 15 రోజులకు పైగా గడిచింది. అప్పటి నుండి ఈ రోజు వరకు కూరగాయలు తెప్పించకుండా అందుబాటులో ఉన్న కారంతో భోజనం పెట్టి నిర్వాహకులు చేతులు దులుపుకుంటున్నారు.
ఈ పాఠశాల అడవి ప్రాంతంలో గ్రామానికి దూరంగా ఉండటంవల్ల పిల్లలు బయటకు రాలేక ఎవరికి తమ అవస్థలు చెప్పుకోలేకపోయారు. ఆ పాఠశాల వార్డెన్ పెట్టింది తింటూ తీవ్ర ఇబ్బందుల(serious trouble)కు గురవుతున్నారు. అయితే నిన్న జరిగిన పేరెంట్స్ సమావేశంలో తల్లిదండ్రుల దృష్టకి విద్యార్థినీ విద్యార్థుల తీసుకెళ్లారు.
ఈ విషయంలో తల్లిదండ్రులు నిలదీసినప్పటికీ పాఠశాల యాజమాన్యం మౌనంతో ఉండడం చర్చనీయాంశంగా మారింది. చివరికి ఈ రోజు పేరెంట్స్ కమిటీ(Parents Committee) సభ్యులు వస్తున్నారని తెలియడంతో గుడ్డుతో కూడిన భోజనం పెట్టారు. అయితే ఆ భోజనంలో పురుగులు రావడంతో పేరెంట్స్ వాళ్లు కూడా అట్టి భోజనాన్ని బయటపడేసి ఉపాధ్యాయుల(Teachers)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించడం లేదని అన్నారు. వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
