School | పాఠశాలలో ఆకట్టుకున్న మాదిరిపోలింగ్.

School | పాఠశాలలో ఆకట్టుకున్న మాదిరిపోలింగ్.
School | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు నిర్వహించిన మాదిరి పోలింగ్ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థి దశ నుండి విద్యార్థులకు రాజకీయ నైపుణ్యం ఎన్నికల నిర్వహణ నామినేషన్ ఓటు హక్కు వినియోగించుకోవడం తదితర అంశాలతో విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించారు.
పాఠశాలలో విద్యార్థులు నామినేషన్ విత్ డ్రా పోలింగ్ ఎన్నికల ఫలితాలు నిర్వహించగా అధ్యక్షులుగా పూజ ఉపాధ్యక్షులుగా కీర్తన, తరగతి లీడర్లుగాస్పందన, మౌనిక, నందిని, స్నేహాలను విద్యార్థులు మాదిరి ఓటు హక్కు ద్వారా ఓట్లు వేసి ఎన్నుకున్నారు.
ఓటు హక్కు పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మాక్ పోలింగ్ ఎన్నికలను తలపించింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు గోవిందమ్మ, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు ప్రేమకుమారి, పిడి పారిజాత, ఉపాధ్యాయ బృందం షాహిన్, శుభాంగి, అంజమ్మ,రాధ, నారాయణ, రాంచందర్ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.
