School | ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని పెంపొందించుకోవాలి

School | ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని పెంపొందించుకోవాలి

School | చిట్యాల, ఆంధ్రప్రభ : సమాజంలో ప్రతి ఒక్కరు సేవా గుణంతో ముందుకు వెళ్లాలని బియ్యమ్మ ఫౌండేషన్ చైర్మన్ మొహమ్మద్ జాంగిర్ ఫాతిమా తెలిపారు. ఈ రోజు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పరిధి చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో గల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలకు స్కూల్ గణతంత్ర వేడుకల సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీల లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.

పాఠశాల అవసరం మేరకు మైక్ సెట్ ను ప్రధానోపాధ్యాయుడు అశోక్ రెడ్డికి అందజేశారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ జాంగిర్ ఫాతిమా మాట్లాడుతూ… పాఠశాలకు ఎలాంటి సహకారం కావాలన్నా మా ఫౌండేషన్ ముందు ఉంటుందని హామీ ఇచ్చారు. అంతకుముందు ఒకటో వార్డులో మాజీ వార్డు సభ్యులు ఫాతిమా జాంగిర్ ఇంటివద్ద 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరేశారు.

School |

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్, నాగరాజు, మామిడి హనుమంతు, మామిడి స్వామి, లోడే రామకృష్ణ, పాకాల చంద్రయ్య, మహమ్మద్ గౌస్ తదితరు పాల్గొన్నారు.

Leave a Reply