School | దాతల ప్రోత్సాహం అభినందనీయం

School | దాతల ప్రోత్సాహం అభినందనీయం
- పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి
School | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : దాతల ప్రోత్సాహం అభినందనీయమని నర్సింహులపేట ప్రాథమిక పాఠశాల(Primary school) ప్రధానోపాధ్యుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు మండల కేంద్రానికి చెందిన కడుదుల చంద్రయ్య అల్లుడు చెన్నం బిక్షపతి ఆర్థిక తోడ్పాటుతో పాఠశాల 1వ, 2వ తరగతులకు చెందిన విద్యార్థులకు స్కూల్ బ్యాగుల(school bags)ను, పెన్నులను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ .. విద్యను ప్రోత్సహించడానికి ఆర్థికం(finances)గా వెనుకబడిన పిల్లలకు సహాయపడటానికి దాతల ప్రోత్సాహం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పసునూరి శ్రీనివాస్, వేముల జగన్, వడ్లూరి వేణుగోపాల్, బొల్లి కృష్ణ, ఎనమల శ్రీనివాస్, బాధ యాకసాయిలు, అజ్మీరా మోహన్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు.
