School construction | చ‌క‌చ‌కా పూర్తి చేయాలి..

School construction | చ‌క‌చ‌కా పూర్తి చేయాలి..

  • యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

School construction | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఎస్ఎల్‌బీసీ కాలనీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ రోజు ఆమె పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే జూన్‌లో విద్యా సంవత్సరం అకాడమీ ప్రారంభమయ్యే నాటికి భ‌వ‌నాన్ని పూర్తి చేయాల‌న్నారు. తరగతి గదులు, డార్మెట్రీ, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎంట్రన్స్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, త్రాగునీరు, ఆట స్థలాల తో సహా పూర్తి చేయాలని ఇంజనీర్, కాంట్రాక్టర్ల‌ను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాల‌న్నారు. నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, నల్గొండ తహసిల్దార్ పరుశురాం, ఇంజినీర్, కాంట్రాక్టర్, తదితరులు ఉన్నారు .

School construction

Leave a Reply