ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

కడెం, ఆంధ్రప్రభ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు మండల కేంద్రమైన కడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అంబేద్కర్ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అర్ల రమేష్ పెద్దూరు మాజీ సర్పంచ్ చిట్యాల చిన్నయ్య, బీఎస్పీ పార్టీ నాయకులు జోసెఫ్ గంగారం, మైస వెంకటేష్, కృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం వాచ్ మెన్ కిరణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply