Schedule | ఎందుకంటే…

Schedule | ఎందుకంటే…
Schedule | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. రంజాన్, ఉగాది పండుగల నేపథ్యంలో ఇంగ్లిష్ పరీక్షను మరుసటి రోజుకు వాయిదా వేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొదట ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లిష్ పరీక్ష మార్చి 20న జరగాల్సి ఉంది. ఉగాది 19, రంజాన్ 20వ తేదీ రానున్న సందర్భంగా పరీక్షను 21కి మార్చారు. మార్చి16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి.
