Sattenapalli | ఏకంగా తల్లినే…

Sattenapalli | ఏకంగా తల్లినే…
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కన్నతల్లినే కూతురు సజీవదహనం (Cremation) చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సత్తెనపల్లిలో కన్నతల్లిని కూతురు సజీవదహనం చేసింది. తల్లి రమాదేవి నిద్రపోయాక చీరలు ఒంటిపై వేసి పెట్రోలు పోసి నిప్పంటించింది. ఈనెల 8న ఈ ఘటన జరిగింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో ఇది హత్యగా తేలింది. కుటుంబ వివాదం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
