Sarpanch | ప్రజాసేవకే గోగినేని దంపతుల ప్రాధాన్యత…

Sarpanch | బోధన్, ఆంధ్రప్రభ : గ్రామంలో ప్రతి కుటుంబం అభివృద్ధికి పాటు పడతానని జాడిజమాల్ పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గోగినేని జ్యోతి నాగేంద్ర బాబు అన్నారు. మాజీ సర్పంచ్ గా గ్రామంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ జ్యోతి ప్రచారం చేపట్టారు. కోటి రూపాయ‌ల వ్యయంతో అంతర్గత రహదారులను సీసీ రోడ్లుగా మార్చినట్లు వివరించారు. ముప్పై డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మించామని, కుల మతాలకు అతీతంగా చేపట్టిన సేవలను వివరించారు. ఒకసారి అధికారం ఇస్తే అన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

Leave a Reply