Sarpanch | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా..

Sarpanch | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా..
- ఊట్కూర్ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సుజాతయగ్నేశ్వర్ రెడ్డి
Sarpanch | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ పట్టణ ప్రజలు ఆదరించి పట్టం కడితే సేవకురాలిగా పనిచేసి మంత్రి సహకారంతో గ్రామానికి నిధులు తీసుకువచ్చి అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ బలపర్చిన ఊట్కూర్ సర్పంచ్ అభ్యర్థి దంతాన్ పల్లి సుజాతయగ్నేశ్వర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మహిళలు పార్టీ నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలను వివరిస్తూ తనదైన శైలిలో ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. ఊట్కూర్‌లో 16 వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరితో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఊట్కూర్ రూపురేఖలు మారుస్తామని అన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు సూర్య ప్రకాశ్ రెడ్డి, మణెమ్మ గోపాల్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఎల్కోటి నారాయణరెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, మైనార్టీ మండల అధ్యక్షులు జలాల్, పట్టణ అధ్యక్షులు లింగం తదితరులు పాల్గొన్నారు.
