Sarpanch | జంగంపల్లి అభివృద్ధి నా లక్ష్యం

Sarpanch | జంగంపల్లి అభివృద్ధి నా లక్ష్యం

  • సర్పంచ్ అభ్యర్థి శోభా న‌ర్సింహులు యాదవ్

Sarpanch | బిక్కనూర్‌, ఆంధ్రప్రభ : మండలంలోని జంగంపల్లి గ్రామ అభివృద్ధే లక్ష్యం అని గ్రామ సర్పంచ్ అభ్యర్థి శోభా న‌ర్సింహులు యాదవ్ అన్నారు. గ్రామాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాన‌ని తెలిపారు. తమపై నమ్మకంతో సర్పంచిగా గెలిపించాలని ఆమె కోరారు. గ్రామంలోని ప్రతీ వార్డులో మురికి కాలువలు సిమెంట్ రోడ్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతాన‌న్నారు. మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. గ్రామంలో ఆమె నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి పలుకుల సంఘాలు డ్వాక్రా మహిళలు యువజన సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి.

Leave a Reply