అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్
ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)లోని ఆలేరు పట్టణ (Aleru Town) కేంద్రంలోని 11,12 వ వార్డు సమీపంలోని బైరామ్ కుంట గండి పడడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. శుక్రవారం పలు వార్డుల్లో అదనపు కలెక్టర్ (Additional Collector) భాస్కర్ రావ్ పర్యటించారు. కురిసిన వర్షానికి ఇండ్లలో నీరు వచ్చి నిల్వ ఉన్నందున మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner)తో కలిసి పారిశుధ్య పనులు చేయించారు. వార్డులలో శానిటేషన్ బ్లీచింగ్ పౌడర్ వేయాలని ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

