Sangareddy | ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై….

Sangareddy | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి పట్టణం వార్డు నెంబర్–1కు చెందిన తెగును భిక్షపతి బీజేపీ పార్టీని వీడి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మల, జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నిర్మలజగ్గారెడ్డి భిక్షపతికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు.

సంగారెడ్డి అభివృద్ధి కోసం జగ్గారెడ్డి, నిర్మలరెడ్డి చేస్తున్న కృషి నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే పార్టీకి భవిష్యత్తు లేదని భావించి పార్టీలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంతకిషన్, బొంగుల రవి, కిరణ్ గౌడ్, నాయకులు కసిని విక్రాంత్, కౌన్సిలర్ అభ్యర్థి కే.కృష్ణ, అమీర్, తోఫిక్, యాదుల్, విజయ్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply